జమిలీ ఎన్నికలు ఊహాగానాలే.. డిసెంబర్‌లోనే ఎన్నికలు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు

by Dishafeatures2 |
జమిలీ ఎన్నికలు ఊహాగానాలే.. డిసెంబర్‌లోనే ఎన్నికలు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జమిలీ ఎన్నికలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో డిసెంబర్‌లోనే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జమిలీ ఎన్నికలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలు ఉండవని, అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. డిసెంబర్‌లోనే ఎన్నికలు ఉంటాయనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. కేసీఆర్‌ను గద్దె దించడమే బీజేపీ ధ్యేయమన్నారు.

బీజేపీ అభ్యర్థుల ఎంపికపై డీకే అరుణ స్పందించారు. అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతామని, అందుకు పరిశీలన చేపడుతున్నట్లు డీకే అరుణ చెప్పారు. మంగళవారం నిజామాబాద్‌లో డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై విమర్శలు కురిపించారు. తెలంగాణ ప్రత్యేక దేశం అని చెప్పిన కవితకు ఈ ప్రాంతంపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని ఆరోపించారు.

ఇది ఇలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 10లోపు నోటిఫికేష్ వస్తేనే తెలంగాణలో ఎన్నికలు ఉంటాయని, లేకపోతే ఏప్రిల్ లేదా మేలో జరగొచ్చని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు డిసెంబర్‌లోనే ఎన్నికలు ఉంటాయని చెబుతుండగా.. బీఆర్ఎస్ నేతలు మాత్రమం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు వెళ్లవచ్చనే అభిప్రాయాలు బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed