Telangana Budget 2023 : రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్

by Disha Web Desk 19 |
Telangana Budget 2023 : రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు హరీష్ రావు జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయాని వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని తెలిపారు. సంక్షేమానికి అభివృద్ధి రెండు జొడేద్దుల్లగా సమపాళ్లలో ఉండబోతోందన్నారు. కేంద్రం నుండి వివక్ష కొనసాగుతుంటే, ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ముందుకెళ్తోందని అన్నారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న కేసీఆర్ ఆలోచనతో బడ్జెట్ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోందని.. దేశానికి రోల్ మోడల్ తెలంగాణ నిలిచిందన్నారు. ఉదయం 10.30కు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నామని తెలిపారు.

Read more:

ఎన్నికల వేళ కేసీఆర్‌కి కొత్త తలనొప్పి.. ఇలాగే కంటిన్యూ అవుతే బీఆర్ఎస్‌కు భారీ దెబ్బే!



Next Story