కేసీఆర్ ప్రభుత్వం ఆ పని చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయను.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Dishafeatures2 |
కేసీఆర్ ప్రభుత్వం ఆ పని చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయను.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తే తాను ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయనని ఛాలెంజ్ చేశారు. తన సవాల్‌ను స్వీకరించడానికి బీఆర్ఎస్ నుంచి ఎవరైనా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అంటే బొందల రాష్ట్ర సమతి పార్టీ అని విమర్శించిన ఆయన.. తెలంగాణలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ అనారోగ్యంతో ఉంటే.. విద్యుత్ సమస్యలపై మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు సమీక్షలు చేయడం లేదని ప్రశ్నించారు.

తాము అధికారంలోకి రాగానే ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని, లేకపోతే తమలాంటి వాళ్లం ప్రభుత్వం నుంచి వెళ్లిపోతామని వెంకటరెడ్డి తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి హామీలనే అమలు చేస్తోందని, కావాలంటే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తెలంగాణ మంత్రులను కర్ణాటకకు తీసుకెళ్లి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లను అమ్ముకుంటుందని హరీష్ రావు చేసిన కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని, ముందు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతుందో ఆయన తెలుసుకోవాలని సూచించారు.



Next Story

Most Viewed