కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఫలితాలపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్

by Disha Web Desk 2 |
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఫలితాలపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గెలిచిన ఎమ్మెల్యేలను శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 16వ తేదీ వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉందని.. కానీ, ప్రజా తీర్పును హుందాగా తీసుకొని రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆరోపణలు, విమర్శలు చేయకుండా ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేయబోతున్న పనులను చూసి నిర్ణయాలు తీసుకుందామని చెప్పారు. అతి త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం నిర్వహించుకొని.. ఫలితాలపై సమీక్ష చేసుకుందామని వెల్లడించారు. అదే సమావేశంలో శాసన సభ పక్ష నేతను కూడా ఎన్నుకుందామని అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed