BJP మాస్టర్‌ ప్లాన్.. KCR , Nitish కొత్త వ్యూహం..!‌‌

by Hajipasha |
BJP మాస్టర్‌ ప్లాన్.. KCR , Nitish కొత్త వ్యూహం..!‌‌
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ వచ్చే ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే ప్లానింగ్‌లో ఉన్నారు. ఆ దిశగానే ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని స్థాపించిన తర్వాత ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు మరింత సిద్దం అవుతున్నారు. అందులో భాగంగానే వచ్చే ఏడాదిలో విపక్షాల ఐక్యతను సాధించేందుకు ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలతో కూడా సమావేశం కావచ్చని భావిస్తున్నారు. బీహార్‌ సీఎంతో మరి కొద్దిరోజుల్లో భేటీ కానున్నట్లు సమాచారం. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేస్తూ నితీశ్‌ కుమార్‌ మహాకూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరు నాయకుల బీజేపీ వ్యతిరేక మిషన్‌లో ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష ఐక్యత అనే వారి ప్లానింగ్‌ను బలహీనపరిచేందుకు ఆ రాష్ట్రాల్లో ఓడించడానికి బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది.

ఆ రెండు రాష్ట్రాలు బీజేపీ టార్గెట్..

వచ్చే లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ బీహార్, తెలంగాణలో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందిస్తోంది. అందుకోసం ఇప్పటికే తమ కార్యకర్తలకు శిక్షణ శిబిరాల ద్వారా రాజకీయ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. ఇటీవల బీజేపీ పాట్నాలో లోక్‌సభ ప్రవాస్ యోజన కింద రెండు రోజుల పాటు విస్తృత శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. అదే తరహాలో డిసెంబర్ 28,29 తేదీల్లో హైదరాబాద్‌లో రెండు రోజుల శిక్షణా శిబిరాన్ని పార్టీ నిర్వహించాలని భావిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేసీఆర్ ఎన్నికల చైతన్యం పెంచుతున్న నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. అందుకే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాతో సహా పార్టీ సీనియర్ నేతలు విస్తృత పర్యటనలతో పాటు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తెలంగాణలోని ప్రతి లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఇక, గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి నుంచి గెలుపోందిన బీహర్ సీఎం నితీష్ కుమార్ ఎన్‌డీఎ కుటమికి స్వస్తి పలికాడు. నితీష్ కుమార్, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్‌డీఎ కుటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత బీహర్‌లో వచ్చే ఎన్నికల్లో ఆ స్థానంపై బీజేపీ కన్నేసింది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను కైవసం చేసేందుకు బీజేపీ జాతీయ నేతలు కృషి చేస్తున్నారు.

బీజేపీని తిప్పికొట్టేందుకు ప్లాన్..

తెలంగాణ, బిహార్ రాష్ట్రాలో బీజేపీ వేస్తున్న ప్లానింగ్‌కు బ్రేకులు వేసేందుకు సీఎం కేసీఆర్, నితీష్ కుమార్ ఏకమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే జనవరిలో ఈ నేతలు ఇద్దరు కలవనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రతిపక్ష పార్టీలతో కూడా సమావేశం కావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను సిద్ధం చేయాలనే బిహార్ సీఎం ఎత్తుగడలు వేస్తుంది తెలిసిన విషయమే. దానికి తోడు కేసీఆర్‌ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను సిద్ధం చేయాలనే ప్రచారంలో నిమగ్నమై ఇటీవల ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి తన ఉద్దేశ్యాన్ని తెలిపారు. కాగా, ఈ నేతల ఇద్దరు ప్రతిపక్షాలలో చర్చలు తర్వాత బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Also Read...

బ్రేకింగ్ న్యూస్: ఆస్పత్రిలో చేరిన Nirmala Sitharaman ..?

Next Story

Most Viewed