కాసేపట్లో ప్రగతిభవన్‌కు MLC Kavitha

by Disha Web Desk 4 |
కాసేపట్లో ప్రగతిభవన్‌కు MLC Kavitha
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పలు అంశాలపై ప్రశ్నించడానికి రావాల్సిందిగా సీబీఐ నుంచి నోటీసు అందుకున్న తర్వాత తొలిసారి తండ్రిని కలవడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్ళారు. గత కొన్ని వారాలుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుట్టూ కవిత వ్యవహారం తిరుగుతుండడంతో నోటీసులు అందుకున్న మరుసటి రోజే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలవడానికి వెళ్ళడం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ నెల 6వ తేదీన విచారణకు రావాల్సిందిగా సీబీఐ ఆమెకు నోటీసు జారీచేసింది. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే విచారణకు సిద్ధంగా ఉంటానని సీబీఐ అధికారులకు కవిత రిప్లై ఇచ్చారు. విచారణలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అంశాలపై సీబీఐ ప్రశ్నించనున్నందున సీఎంతో ఆమె ఏం చర్చిస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉండగా తండ్రిని కలవడానికి ప్రగతి భవన్‌కు వెళ్తున్న ఎమ్మెల్సీ కవితకు మహిళలు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మద్దతుగా నిలిచారు. మద్యం కుంభకోణానికి సంబంధించి అమిత్ అరోరాను గత నెల చివరి వారంలో అరెస్టు చేసిన తర్వాత కస్టడీ కోరుతూ స్పెషల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కవిత పేరును ప్రస్తావించిన మరుసటి రోజే ఆమె నివాసానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. సంఘీభావం తెలిపారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పుడు ఏకంగా సీబీఐ నుంచి నోటీసులు రావడంతో ఈ నెల 6న విచారణ సందర్భంగా వ్యవహరించాల్సిన తీరు, ఇవ్వాల్సిన సమాధానం తదితరాలపై తండ్రితో చర్చించేందుకే ఆమె ప్రగతి భవన్ వెళ్ళినట్లు పార్టీ వర్గాల సమాచారం.

సీబీఐ, ఐటీ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు వేధిస్తాయని, వెంటబడి వేటాడుతాయంటూ గత కొన్ని నెలలుగా సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో పార్టీ నేతలను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ అంచనాలు నిజమయ్యే తీరులోనే ఇప్పుడు తన కూతురికి సీబీఐ నోటీసులు జారీచేయడం గమనార్హం. ఏమేం చర్చిస్తారు, ఆయన నుంచి ఎలాంటి సూచనలు తీసుకుంటారన్నది సాయంత్రానికి ఒక మేరకు వెలుగులోకి వచ్చే అవకాశమున్నది. ఈడీకి, మోడీకి భయపడేదే లేదని, జైల్లో పెడితే పెట్టుకోనీ.. అంటూ రెండు రోజుల క్రితం ఆమె కామెంట్ చేసిన నేపథ్యంలో ఈ నెల 6న సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు మానసికంగా సిద్ధం కావడం గమనార్హం.


Also Read.......

సమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్ పంపిండు : MLC Kaushik Reddy


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed