మంత్రి కేటీఆర్ ను కలిసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్.. ఏం చర్చించారో తెలుసా

by Disha Web Desk 20 |
మంత్రి కేటీఆర్ ను కలిసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్.. ఏం చర్చించారో తెలుసా
X

దిశ, మంథని : మంథని నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి కేటీఆర్‌ ను పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ కోరారు. ఆసెంబ్లీ ప్రాంగణంలో గురువారం మంత్రి కేటీఆర్ ను కలిసి నియోజకవర్గంలోని పలుసమస్యల పై చర్చించారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంతో పాటు అభివృధ్ది పనులకు నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధికి బాటలు పడ్డాయని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే మంథని నియోజకవర్గంలో పలుసమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులకు నిధుల కేటాయించాలని మధుకర్ వివిధ శాఖల మంత్రులను కలిసి విన్నవించారు.

మంథని మధూకర్‌ కోరారు. పెద్దపల్లి నుంచి కాటారం వరకు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. బీసీ గురుకుల భవనాలకు నిధులు మంజూరు చేయాలని మంత్రి గంగుల కమలాకర్‌ కు విన్నవించారు. నియోజకవర్గంలో సొంత గూడులేని పంచాయతీలకు భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కోరారు. వివిధ కారణాలతో ఆగిపోయిన కొంత మంది గిరిజనులకు పట్టాలు అందించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నాయకుడు జక్కురాకేష్ అన్నారు.



Next Story

Most Viewed