వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. పెళ్లి పిలుపులో నయా ట్రెండ్..

by Disha Web Desk 23 |
వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. పెళ్లి పిలుపులో నయా ట్రెండ్..
X

దిశ,జగిత్యాల ప్రతినిధి: " ఈనెల 20న మా సిన్న కొడుకు లగ్గం.. యాది ఉంచుకొని అందరూ వచ్చి మా పిల్లా పిలగాన్ని దీవెనార్తి ఇచ్చి కడుపు నిండా తిని పోతే మా దిల్ కుష్ అయితది" అంటూ తెలంగాణ యాస ఉట్టిపడేలా ఉన్న ఒక పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపూర్వ ఘట్టం. అలాంటి పెళ్లిని జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటారు. పెళ్లి వేడుకను కొందరు కోట్లు ఖర్చు పెట్టే అంగరంగ వైభవంగా ఆర్భాటంగా చేసుకుంటే మరికొందరు మాత్రం సింపుల్ గా కొద్ది మంది సమక్షంలోనే చేసుకుంటారు. ఎలాంటి పెళ్లి వేడుకకు అయినా బంధుమిత్రులను పిలిచేందుకు ఆహ్వానం తప్పనిసరి. అయితే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం ఈదుల లింగంపేట కు చెందిన సతీష్ రెడ్డి తన పెళ్లి ఆహ్వాన పత్రికను ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా తయారు చేయించాడు. తెలంగాణ యాస ఉట్టిపడేలా " వెల్మలోళ్ల లగ్గం పిలుపు " అంటూ వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేయించాడు. సతీష్ రెడ్డి క్రియేటివిటీకి బంధుమిత్రులు ఫిదా అయ్యారు.


Next Story

Most Viewed