పట్టణ పరిశుభ్రత మన చేతుల్లోనే : అదనపు కలెక్టర్ మకరంద్

by Disha Web Desk 1 |
పట్టణ పరిశుభ్రత మన చేతుల్లోనే : అదనపు కలెక్టర్ మకరంద్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : పట్టణ పరిశుభ్రత మన చేతుల్లోనే ఉందని మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మకరంద్ అన్నారు. ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని చారిత్రాత్మక ప్రాంతమైన ఖిలా ప్రాంతంలో అదనపు కలెక్టర్ దంపతులు స్పెషల్ శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఖిలా పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త చెదారాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. 40 అడుగుల లోతులో ఉన్న మురికి నీటి శుభ్రం అవ్వడానికి బయో ఎంజైమ్స్ చల్లారు. వారి వెంట మున్సిపల్ ఇంచార్జీ చైర్మన్ గోలి శ్రీనివాస్, మెప్మా, పంచాయతీ శాఖ, అటవీ, మున్సిపల్ విభాగ అధికారులు పాల్గొన్నారు.Next Story

Most Viewed