జీతాల్లేవ్..మాతా శిశు దావఖాన సిబ్బంది ఇబ్బందులు

by Dishanational2 |
జీతాల్లేవ్..మాతా శిశు దావఖాన సిబ్బంది ఇబ్బందులు
X

రెక్కాడితే కానీ డొక్కాడని వేతన జీవులు జీతాల్లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పని చేస్తున్న సిబ్బంది సక్రమంగా వేతనాలు అందక తిప్పలు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు వైద్య సేవలు అందించే ఉద్దేశంతో రూ.17కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఆస్పత్రిలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో పనిచేసేందుకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సిబ్బంది నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సదరు కాంట్రాక్టర్ ప్రతినెల వేతనాలు చెల్లించకపోవడంతో తమ కుటుంబాలు గడవడం లేదని వాపోతున్నారు. తమకు 9నెలల నుంచి వేతనాలు పెండింగ్ ఉన్నాయని బీఎస్పీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ సంగీతను కలిసి విన్నవించారు. తమకు ప్రతినెల వేతనాలు అందేలా చూడాలని కార్మికులు వేడుకున్నారు.

దిశ, పెద్దపల్లిటౌన్ : రెక్కాడితే కానీ డొక్కాడని వేతన జీవులు జీతాల్లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పని చేస్తున్న సిబ్బంది సక్రమంగా వేతనాలు అందక తిప్పలు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు వైద్య సేవలు అందించే ఉద్దేశంతో రూ.17కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేసి అనతి కాలంలోనే నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇంతవరకు బాగానే ఉన్నా నగరం నడిబొడ్డున పెద్ద భవనంలో వసతుల కల్పనకు, నిత్యం శుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని, ఆస్పత్రి సెక్యూరిటీ కోసం మూడు విభాగాల్లో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 83మంది సిబ్బందిని నియమించారు. ఇందులో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు. వారందరిని గతేడాది రిక్రూట్ మెంట్ చేసుకొని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ వారిని నియమించుకున్న సదరు కాంట్రాక్టర్ అనేక ఇబ్బందులకు గురిచేస్తూ వేతనాలు సరిగా చెల్లించడం లేదు. 40మందికి ఆర్డర్ కాపీలు ఇప్పటివరకు ఇవ్వలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి నెలకు జీతం రూ.15600, పీఎఫ్ ఇతర కట్టింగులు పోగా రూ.12,194 చెల్లించాల్సిఉంది. కానీ, కాంట్రాక్టర్ ఇప్పటివరకు కేవలం మూడు నెలల జీతాలు మాత్రమే ఇచ్చి అవి కూడా రూ.10వేలకు మించకుండా ఇస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెగ్గుకు రావడం కష్టంగా ఉందని, ఆ ఇచ్చే జీతాన్ని ఏ నెలకానెల ఇచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వారి గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అనేక ఇక ఇబ్బందులు గురవుతున్నారు. గురువారం కొందరు కార్మికులు బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి ఉష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సంగీతాసత్యనారాయణను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తినేందుకు తిండి లేక కష్టపడుతున్నామని, తమ సమస్యను మీరే తీర్చాలంటూ కలెక్టర్‌కు విన్నవించారు.

వేరే గ్రామాల నుంచి వచ్చే ఉద్యోగులు కొందరు బైక్‌లో పెట్రోల్ పోయించుకొని వచ్చే పరిస్థితి లేక ఇంట్లోనే ఉంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని వేడుకున్నారు. ఇకనైనా సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని తమకు ఆర్డర్ కాపీలతోపాటు పెండింగ్ ఉన్న 9 నెలల జీతాన్ని ఇప్పించాలని వారు కోరారు. ఈ సమస్యపై ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.



Next Story

Most Viewed