విశాఖలో ఓటు హక్కు వినియోగించుకున్న గంటా

by srinivas |
విశాఖలో ఓటు హక్కు వినియోగించుకున్న గంటా
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఉదయం 7 గంటలకు విశాఖ తూర్పు నియోజకవర్గం ఎం.వి.పి. కాలనీ సెక్టార్ - 4లోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్‌లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. భార్య శారద ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు వేసి మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలు, రాజకీయ, సినీ ప్రముఖులందరూ ఓటు మక్కు వినియోగించుకుంటున్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకూ ఓటింగ్ జరుగుతుంది. అనంతరం కూలైన్ లో ఉన్న వాళ్లందరికీ ఓటు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story
null