వాళ్లది కబ్జాల ఆరాటం.. నాది పేదల పోరాటం : బండి సంజయ్

by Disha Web Desk 23 |
వాళ్లది కబ్జాల ఆరాటం.. నాది పేదల పోరాటం : బండి సంజయ్
X

దిశ,కరీంనగర్: కరీంనగర్ నియోజకవర్గంలోని జూబ్లీనగర్, ఫకీర్ పేటలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం చేశాడు. గంగుల కమలాకర్ కు 2సార్లు అధికారమిస్తే భూములు కొల్లగొట్టిండు... గుట్టలనే ధ్వంసం చేసిండు.. పొరపాటున మళ్లీ గెలిపిస్తే..ఈసారి ఏకంగా మీ మీ ఇండ్లను కొట్టేయడం ఖాయం. నాది పేదల కోసం ఎంతకైనా తెగించే నైజం... ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండి...’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ కు రెండుసార్లు అధికారమిస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి పుట్టబోయే బిడ్డపై కూడా లక్షన్నర రూపాయల అప్పు భారం మోపారని మండిపడ్డారు. ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలోని జూబ్లీనగర్ గ్రామానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ ఫకీర్ పేట్, జూబ్లీనగర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రేషన్ కార్డులు ఎట్లస్తిరో.. పెన్షన్ ఎట్లస్తిరో కూడా తెల్వదు... భూకబ్జాలు తప్ప మరేమీ తెల్వదు... ప్రజల కోసం ఎన్నడూ కొట్లాడలేదు... మీకోసం ఎన్నడైనా డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కొట్లాడారా? పెన్షన్, రేషన్ కార్డుల కోసం ఉద్యమించారా.. అంటూ బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed