అయ్యయ్యో... దశాబ్ధి ఉత్సవాల వేళ ఘోరం

by Shiva Kumar |
అయ్యయ్యో... దశాబ్ధి ఉత్సవాల వేళ ఘోరం
X

తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం.. పట్టించుకోని అధికారులు

దిశ, సైదాపూర్ : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న వేళ తెలంగాణ తల్లి విగ్రహానికి ఘోర అవమానం ఎదరైంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో 2008 సంవత్సరంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కుడి చేయి ధ్వంసమైంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు విషయాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు తెలంగాణ తల్లి అలంకరణకు కూడా నోచుకోకపోవడంతో మండల కేంద్రంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తెలంగాణ తల్లి విగ్రహానికి కుడి చెతిని అమర్చి విగ్రహాన్ని అన్ని హంగులతో అలంకరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.Next Story

Most Viewed