ట్రాక్టర్ బ్యాటరీలను తస్కరించిన దొంగలు..

by Sumithra |
ట్రాక్టర్ బ్యాటరీలను తస్కరించిన దొంగలు..
X

దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపల్లి, తండ్రియాల గ్రామాల్లో ఇంటి బయట రోడ్లపై నిలిపి ఉంచిన ట్రాక్టర్ వాహనాల బ్యాటరీలు దొంగిలించారు. వివరాల్లోకి వెలితే మండలంలోని ఇప్పపెల్లి, తాండ్రియాల గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ ట్రాక్టర్లను వ్యవసాయ పనుల కోసం ఉపయోగించి పార్క్ చేయగ 3 ట్రాక్టర్లు, 1 టిప్పర్ కి సంబంధించిన 4 బ్యాటరీలను మంగళవారం రాత్రి దొంగలించారు. దొంగతనానికి గురైన ఒక్కో బ్యాటరీ ధర రూ. 10 వేల వరకు ఉంటుందని ట్రాక్టర్ యజమానులు దిశ ప్రతినిధి తో వాపోయారు.

అసలే అంతంత మాత్రంగా కురుస్తున్న వర్షాలతో కొద్ది మంది రైతులు పొలాలు వేయడానికి సిద్ధం అవుతున్న తరుణంలో ఇలా బ్యాటరీలు చోరికి గురి కావడంతో తమకు వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని కోల్పోతున్నామని ట్రాక్టర్ యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే స్థానిక పోలీసు సిబ్బంది తమ ట్రాక్టర్ బ్యాటరీల చోరికి పాల్పడ్డ దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.Next Story

Most Viewed