పాఠశాల సమయానికి బస్సు నడపాలి..

by Sumithra |
పాఠశాల సమయానికి బస్సు నడపాలి..
X

దిశ, పెగడపల్లి : పాఠశాలల టైంకి అనుగుణంగా బస్సు సర్వీస్ నడపాలని విద్యార్థులు, వారి తల్లి దండ్రులు బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శంకరయ్య తో కలిసి ఆర్టీసీ డీఎంకి వినతి పత్రం అందజేశారు. మండలంలోని లింగాపూర్ గ్రామం నుండి మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్ కి వెళ్లేందుకు నడుపుతున్న బస్ స్కూల్ టైం కి అనుగుణంగా రావడం లేదని బస్ గ్రామానికి వచ్చేసరికి ఉదయం 9.30 అవుతుందని, పాఠశాలకి వెళ్ళేసరికి తరగతులు మొదలై పాఠాలు వినలేకపోతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తి చేస్తున్నారు. పాఠశాల టైం కి అనుగుణంగా బస్సు సర్వీస్ నడపాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు జగిత్యాల డీఎంకి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీఆర్ఎస్ నాయకుడు బొడ్డు శంకరయ్య, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.Next Story

Most Viewed