అకాల వర్షాల ఎఫెక్ట్.. అన్నదాత ఆగమాగం

by Disha Web Desk 4 |
అకాల వర్షాల ఎఫెక్ట్.. అన్నదాత ఆగమాగం
X

దిశ, కథలాపూర్ : వాతావరణ మార్పులతో కురుస్తున్న అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే వరి ధాన్యం, నువ్వు పంటల కోతలు ఊపందుకున్నాయి. మరో వైపు ఈ సారి మామిడి సైతం అంతంతే కతాకు వచ్చి కాసిన కొద్ది పంటలు అకాల వర్షాలు, గాలులకు పంటలు నేలకొరుగుతుండగా, మామిడి కాయలు నెల రాలుతుండంతో రైతులు తీవ్ర నష్టాల భారిన పడుతున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో గత రాత్రి కురిసిన అకాల వర్షాలు, ఉరుములతో కూడిన వడగాల్పుతో రైతన్న బెంబలెత్తిపోతున్నాడు. దీంతో రాత్రి సమయంలో ఎక్కడ చూసిన రైతన్నలు టార్పారిన్ కవర్లతో కల్లాల చుట్టూ పరిగెత్తుతూ ఎక్కడ తమ వడ్ల కుప్పలు తడిసిపోతాయానే ఆందోళనలతో టార్పారిన్ కవర్లు కప్పుతూ తమ వడ్ల కుప్పలను కాపాడుకునే ప్రయత్నం చేశారు.

ఆరుగాలం పండించిన పంటలు ప్రకృతి విలయానికి నెలకోరుతుంటే తీవ్ర నష్టాల పాలవుతున్నామని ఆవేదన చెందున్నారు. గురువారం రాత్రి మండలంలో ఈదురు గాలులకు పొలాల్లో వరి నేలకొరిగింది. మండలంలోని బొమ్మేనతో పాటు పలు గ్రామాల్లో మామిడి కాయలు నెల రాలాయి, దీంతో మామిడి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొనుగోళ్లు కేంద్రాలకు చేరిన వరి ధాన్యం కొనుగోళ్ళు నత్తనడకన సాగుతుండడంతో, మరో వైపు అకాల వర్షాలు, వడ కాల్పులు వెంటాడుతుండంతో రైతుల్లో భయాందోళన చెందుతున్నారు. దీనికి తోడు ఈ అకాల వర్షాలను అదునుగా భావించి రైస్ మిల్లర్లు తేమ శాతం ఎక్కువగా ఉండనే సాకుతో ధాన్యంలో మరింత కటింగులకు పాల్పడుతున్నారనే భయం రైతులు నెలకొన్నది. రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడతాయానే వార్తలు రావడం తో రైతులు ధాన్యం కొనుగోళ్ళు ముమ్మరం చెయ్యాలని అధికారులను కోరుతున్నారు.

Next Story

Most Viewed