సోనియాతోనే తెలంగాణ వచ్చింది : తారిక్ అహ్మద్

by Aamani |
సోనియాతోనే  తెలంగాణ వచ్చింది :  తారిక్ అహ్మద్
X

దిశ,హుజురాబాద్: సోనియాగాంధీ తో నే తెలంగాణ వచ్చిందని, వచ్చిన తెలంగాణలో ఇంతకాలం కేసీఆర్ అల్లిన పంజరంలో బంధించబడ్డామని, కేసీఆర్ కుటుంబంతో తెలంగాణ రాలేదని సీడబ్ల్యూసీ మెంబర్ తారీకు అహ్మద్ అన్నారు .హుజురాబాద్ మండలం కాట్రపల్లిలో సోమవారం ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి దక్షిణ భారతదేశంతో ఎంతో అవినాభావ సంబంధం ఉందని, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేస్తుందని, స్థానిక ప్రభుత్వం పది సంవత్సరాలైనా హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు.

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని లక్ష ఉద్యోగాల సైతం భర్తీ చేయలేదని, కాంగ్రెస్ హయాంలో గ్యాస్ ధర 400 రూపాయలు ఉండేదని, ప్రస్తుతం గ్యాస్ ధర 1100 పైన చేరుకుందని అన్నారు బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతూనే పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తిరిగి గ్యాస్ ధర తగ్గించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుందని, మహిళలకు 4000 పింఛను, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రైతులకు 15వేల రైతుబంధు, ఆరోగ్యశ్రీ కార్డు పైన 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హమీద్ కర్, బాల్మూరు వెంకట్,సొల్లు బాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed