ఆ చైర్మన్ పోస్ట్ సరస్వతక్కకే ఇవ్వండి సార్... KTR కు రిక్వెస్ట్

by Dishanational1 |
ఆ చైర్మన్ పోస్ట్ సరస్వతక్కకే ఇవ్వండి సార్... KTR కు రిక్వెస్ట్
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల ఏఏంసీ చైర్మన్ పదవి కోసం పలువురు మహిళ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల ఏఏంసీ చైర్మన్ గా కొనసాగుతున్న సింగిరెడ్డి రవీందర్ రెడ్డి పాలకవర్గం పదవీకాలం డిసెంబర్ 28తో ముగియనుంది. తెలంగాణా ప్రభుత్వం వచ్చాక.. సిరిసిల్ల ఏఏంసీకి మూడు పాలకవర్గాలు పనిచేశాయి. డిసెంబర్ 29న నాల్గవ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈసారి సిరిసిల్ల ఏఏంసీకి బీసీ ఉమెన్ కు రిజర్వు కావడంతో సిరిసిల్ల, తంగళ్లపల్లికి చెందిన పలువురు మహిళా నాయకురాళ్లు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా తంగళ్లపల్లి మండలంలో టీఆర్ఎస్ పార్టీ అవిర్భావం నుంచి పనిచేస్తున్న మాజీ ఎంపీపీ పూసపల్లి సరస్వతి ఎనిమిదేళ్లుగా నామినేట్ పోస్ట్ కోసం ఎదురుచూస్తుంది. తంగళ్లపల్లి మండలంతోపాటు సిరిసిల్లలో పూసపల్లి సరస్వతికి ఉద్యమ మహిళ నేతగా మంచి పేరుంది. మంత్రి కేటీఆర్ దగ్గర సైతం సరస్వతికి మంచి మహిళ నేతగా పేరుంది. దీంతో నాలుగు నెలల క్రితం సరస్వతికి సెస్ డైరక్టర్ పదవి మంత్రి కేటీఆర్ కేటాయించారు. కానీ కొంత మంది సెస్ పాలకవర్గంపై కోర్టుకు వెళ్లడంతో సెస్ పాలకవర్గం రద్దు కావడంతో పూసపల్లి సరస్వతి సెస్ డైరక్టర్ పదవి నెలన్నరలోనే కొల్పోయింది. దీంతో తంగళ్లపల్లి మండలంలో పూసపల్లి సరస్వతిపై టీఆర్ఎస్ పార్టీలో సానూభూతి వ్యక్తమవుతుంది.

ఈసారి సిరిసిల్ల ఏఏంసీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో తంగళ్లపల్లి టీఆర్ఎస్ నేతలు పలువురు పూసపల్లి సరస్వతి పేరును సూచిస్తున్నారు. పార్టీకి మొదటి నుంచి పని చేసిన సరస్వతక్కకే ఏఏంసీ చైర్మన్ పదవి కేటాయించాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా సిరిసిల్ల పట్టణం నుంచి కూడా పలువురు మహిళ నాయకురాళ్లు కూడా ఏఏంసీ పదవి కోసం ప్రయత్నాలు సాగుస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైన ఎనిమిదేళ్లుగా నామినేట్ పోస్టు కోసం ఎదరుచూస్తూ సెస్ డైరక్టర్ పోస్టు కొల్పోయి భంగపాటుకు గురైన మాజీ ఎంపీపీ పూసపల్లి సరస్వతికి ఈ ఏఏంసీ పదవైన దక్కుతుందో లేదా.. మంత్రి కేటీఆర్ ఆశీర్వాదం ఉంటుందా..ఉండదా వేచి చూడాలి.

Read more:

MLA Purchase Case: : 'బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు'


Next Story

Most Viewed