తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడండి : గంగుల

by Disha Web Desk 23 |
తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడండి : గంగుల
X

దిశ, కరీంనగర్ టౌన్ : వేసవికాలం దృష్ట్యా నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం లోయర్ మానేరు డ్యామ్ లో అడుగంటిన నీటి నిల్వలను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, మేయర్ యాదగిరి సునీల్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ , మానకొండూరు తో పాటు నగర చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందించే లోయర్ మానేరు డ్యామ్ లో నీటి నిల్వలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు...తన 25 ఏండ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా మార్చి మాసంలో నీటి నిల్వలు పడిపోవడం చూడలేదని అన్నారు. ప్రస్తుతం ఎల్ఎండిలో 5,3 టీఎంసీల నీరు నిల్వ ఉందని.. తమ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతనే దిగువకు సాగునీరు అందించాలనే జీ.వో ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.

మిషన్ భగీరథ కోసం ఎల్ఎండి లో 13 టీఎంసీల లు , ఎం ఎం డి లో 6.5 టీఎంసీల నిల్వలు తగ్గకుండా చూసారని అన్నారు. మొదటి ప్రాధాన్యత తాగునీటి అవసరాలకు ఇచ్చిన తర్వాతనే సాగునీరు అందించే వారమని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం జలాలతో లోయర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు రిజర్వాయర్లను కాళేశ్వరం జలాలతో నింపడంతో రెండు రిజర్వాయర్లు నిండు కుండలా ఉండేవని అన్నారు. దీనితో కరీంనగర్ లో, ప్రతి రోజు నీటి సరఫరా తో పాటు చాలా చోట్ల 24/7 గంటలు నీటి సరఫరా కొనసాగించామనివెల్లడించారు.. మానేరు డ్యామ్ లో ఉన్న 5 టీఎంసీల లనీళ్లకు మరో 2 టీఎంసీల నీళ్లను ఎస్ఆర్ఆర్ రిజర్వాయర్ నుండి నింపినట్లయితే, కరీంనగర్ ప్రజలకు రోజు ఒక గంట నీళ్ళు ఇవ్వొచ్చని గంగుల కమలాకర్ వెల్లడించారు.



Next Story

Most Viewed