పాఠశాల అభివృద్ధి పనులు మే 15లోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

by Disha Web Desk 23 |
పాఠశాల అభివృద్ధి పనులు మే 15లోగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్
X

దిశ,పెద్దపల్లి ప్రతినిధి : పాఠశాల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను అమ్మ ఆదర్శ కమిటీలు త్వరితగతిన రూపొందించి పనులను మే 15లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మండల సమాఖ్య సంఘాలు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో ఉన్న 516 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేశామని, వీటిలో ఇప్పటి వరకు 182 పాఠశాలల్లో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు మాత్రమే సిద్ధం చేశారని,చేపట్టాల్సిన పనులు గుర్తించి వెంటనే వాటి ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పాఠ్యాంశాలు బోధిస్తున్నా మని, పేరెంట్ టీచర్స్ మీటింగ్, విద్యార్థులను క్రీడల్లో, చదువులో ప్రోత్సహించడం, సైన్స్ ఫెయిర్ నిర్వహణ, టీఎల్ఎం ద్వారా విద్యా బోధన వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. ప్రైవేటు పాఠశాల కంటే నైపుణ్యం అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారని, ప్రభుత్వం కూడా ప్రైవేటుకు దీటుగా వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను పంపాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన మార్పులపై ఫీడ్ బ్యాక్ అందించాలని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీసీఈఓ నరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి డీ. మాధవి, డీఆర్డిఓ రవీందర్, ఈఈపీఆర్ ,జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ సరస్వతి, మండల సమాఖ్య సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed