జగిత్యాలలో ఆర్ఎస్‌పీ.. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణితో చర్చలు

by Disha Web Desk 12 |
జగిత్యాలలో ఆర్ఎస్‌పీ.. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణితో చర్చలు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: బహుజన వాదమే నినాదంగా ముందుకు సాగుతున్న బీఎస్పీ బలమైన నాయకత్వం వైపు కన్నేసినట్టు కనిపిస్తోంది. స్టేట్ చీఫ్‌గా ఆర్ఎస్పీ బాధ్యతలు చేపట్టిన తరువాత వైవిద్యంగా ముందుకు సాగుతున్న బీఏస్పీ క్యాడర్ బుధవారం మరో అడుగు ముందుకేసింది. ఇటీవలే రాజీనామా చేసిన జగిత్యాల మునిసిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి ఇంటికి వెల్లి చర్చలు జరిపారు. శ్రావణి రాజీనామా చేసినప్పటి నుండి ప్రతిపక్ష పార్టీ నాయకులు పరోక్షంగా ఆమెకు మద్దతు తెలుపుతున్నాప్పటికీ ప్రత్యక్ష్యంగా ఆమెను కలిసి మాట్లాడిన నేతలు లేరు. బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ నేరుగా శ్రావణి ఇంటికి వెల్లి కలవడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్ పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిప్పటి నుండి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తూ.. ప్రజల మన్ననలు పొందుతున్న శ్రావణిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తుందనడానికి బహుజన బిడ్డ శ్రావణి రాజీనామాయే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో శ్రావణిపై రాజకీయంగా ఎలాంటి దాడులు జరిగినా జగిత్యాల అగ్నిగుండంగా మారుతుందని, ఇందుకు పూర్తి బాధ్యత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వహించాల్సి ఉంటుందని స్పష్ఠం చేశారు. వెనుకబడిన బహుజన వర్గాలు ఏ పార్టీలో ఉన్నప్పటికీ వారిని అణిచివేసే విధంగా అగ్రవర్ణాలు కుట్ర చేస్తే బీఎస్పీ పోరాటం చేసి అండగా నిలబడతుందని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.

పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం..

బోగ శ్రావణి బీఎస్పీలో చేరుందుకు వస్తే స్వాగతిస్తామని బీఎస్పీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బోగ శ్రావణిని కలిసిన అంనతరం మీడియా ప్రతినిధులు బోగ శ్రావణిని మీ పార్టీలోకి ఆహ్వానిస్తారా అని అడినప్పుడు పై విధంగా స్పందించారు. ఏ పార్టీలో చేరాలన్న అంశం ఆమె వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed