మా భూమిని ఆర్ఎంపీ కబ్జా చేసాడు.. మహిళా సంఘాల ఆందోళన.

by Aamani |
మా భూమిని ఆర్ఎంపీ కబ్జా చేసాడు.. మహిళా సంఘాల ఆందోళన.
X

దిశ, కథలాపూర్ : తమకు చెందిన భూమి ఓ ఆర్ఎంపీ డాక్టర్ కబ్జా చేసాడంటూ కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామంలో మహిళా సంఘ సభ్యులు ఆందోళనకు దిగారు. మహిళా సంఘం నుండి కష్టపడి కూడబెట్టిన డబ్బులతో గ్రామంలో 5 గుంటల భూమిని కొనుగోలు చేస్తే అక్రమంగా ఆర్ఎంపీ డాక్టర్ ఆక్రమించడని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహిళా సంఘ సభ్యులే దగ్గర ఉండి మరి సదరు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేయించారు.పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు ఆందోళన చేపట్టడం తో కొద్ది సేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉండగా కబ్జా కు పాల్పడిన వ్యక్తి ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ విషయమై సంఘ సభ్యులు పోలిసులను ఆశ్రయించనున్నట్లు సమాచారం.Next Story

Most Viewed