రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

by Aamani |
రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా :  ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
X

దిశ, గోదావరిఖని: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రామగుండంను అభివృద్ధి పథంలో తీసుకెళతామని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు రామగుండం అభివృద్ధిని విస్మరించారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రూ.100 కోట్ల ప్రత్యేక నిధులతో రామగుండం కు పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నూతన పరిశ్రమలు నెలకొల్పుతామని ఎమ్మెల్యే తెలిపారు. గోదావరి నది కలుషితం కాకుండా ఎస్టిపిలను నిర్మిస్తామని, పారిశ్రామిక ప్రాంతంలోని కార్మిక కుటుంబాలకు సురక్షిత మంచి నీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.Next Story

Most Viewed