అంకితభావంతో విద్యను అభ్యసించాలి: జడ్పీ చైర్మన్ పుట్ట మధు

by Dishanational1 |
అంకితభావంతో విద్యను అభ్యసించాలి: జడ్పీ చైర్మన్ పుట్ట మధు
X

దిశ, మల్హర్: గురువులు బోధించే విద్యను అంకిత భావంతో అభ్యసించాలని పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ విద్యార్థులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని తాడిచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవ వేడుకలు విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ కాలేజీలలో చదివే విద్యార్థులు ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదని, తన యొక్క తల్లి పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత కొద్దిరోజుల నుండి ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తూ విద్యార్థులకు ఇంకా ఉత్సాహంగా చదువుకోవడానికి సహకారం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జిల్లా నోడల్ అధికారి దేవరాజ్, ఎంపీపీ చింతల మలహల్రావు, ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి, పీఏసీఎస్ చైర్మన్ మల్కా ప్రకాష్ రావు, మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాస్ రావు, ట్రస్ట్ ఫుడ్ ఇన్చార్జ్ రాఘవరెడ్డి, కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస్ రావు, మంథని మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవర్నేని రాజేశ్వరరావు, కాలేశ్వర దేవస్థానం డైరెక్టర్ బి రాజయ్య బీఆర్ఎస్ నాయకుడు కోట రవి తోపాటు పలువురు ఉన్నారు.



Next Story

Most Viewed