ఈ సిస్టమ్‌ను మా పంజాబ్‌లో బీ అమలు చేస్తం: సీఎం భగవంత్ మాన్

by Dishanational1 |
ఈ సిస్టమ్‌ను మా పంజాబ్‌లో బీ అమలు చేస్తం: సీఎం భగవంత్ మాన్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రిజర్వాయర్లు, చెక్ డ్యాంలు భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడుతున్నాయి. తెలంగాణ నీటిపారుదల మోడల్ దేశానికి ఆదర్శమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గురువారం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ను, కొండపోచమ్మ పంప్ హౌస్ ను, ఎర్రవల్లిలోని చెక్ డాంను, గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువును సందర్శించారు. పాండవుల చెరువు వద్ద రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రత్యేకతలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు వివరించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు నాలెడ్జ్ షేరింగ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంను పరిశీలించేందుకు రాష్ట్రానికి రావడం జరిగిందన్నారు. 500 మీటర్ల పైకి గోదావరి జలాలను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకువచ్చి మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం ఆదర్శనీయమన్నారు. మంచి ఎక్కడ ఉన్న సంగ్రహించి, ప్రజలకు మంచి చేయడమే నాయకుడి ప్రథమ కర్తవ్యం అన్నారు. ఢిల్లీలో మాదిరి బస్తీ దవాఖానలను తెలంగాణలో ప్రారంభించగా, తమిళనాడు సీఎం స్థాలిక్ ఢిల్లీలో అమలు చేస్తున్న విద్యా విధానం తరహాలో తమిళనాడులో రుపొందించారన్నారు. పంజాబ్ లో ఐదు నదుల సంఘమం, నీటి సాగునీటి వినియోగానికి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో కొన్ని జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి చేరాయన్నారు.


తెలంగాణ మోడల్ ను అనుసరించి పంజాబ్ లో చెక్ డ్యాంలు నిర్మించి, జల సంపదను భవిష్యత్ తరాలకు అందించేందకు చర్యలు తీసుకుంటామన్నారు. రంగీలా పంజాబ్ గా తీర్చిద్దితామన్నారు. మార్చి నెలలో ప్రవేశ పెట్టనున్న పంజాబ్ రాష్ట్ర బడ్జెట్ లో నీటిపారుదల, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. భారత దేశానికి పంజాబ్ ఎల్లప్పుడూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ లాగా నీళ్ళ సేకరణ కోసం కొత్త విధానాన్ని రూపొందిస్తామన్నారు. మంచి మనసున్న నాయకుడు ఉంటే ప్రాంతం ఎల్లపుడూ అభివృద్దిలో దూసుకోపోతుందన్నారు. పంజాబ్ లోని కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు లేక నాసా వాటిని రెడ్ జోన్ గా ప్రకటించిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ వచ్చాక ఢిల్లీ అన్ని విషయాల్లో అభివృద్ది చెందిందన్నారు. ఉచిత కరెంట్, విద్యా వ్యవస్థ, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం క్రేజీవాల్ ఇద్దరు సీఎంలు కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed