తాటి, ఈత వనం దగ్ధం

by Disha Web Desk 1 |
తాటి, ఈత వనం దగ్ధం
X

దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా భీమరం మండలంలోని కమ్మర్ పేట గ్రామ శివారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 60 తాటి చెట్లు, 80 ఈత చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు ఏవిధంగా వ్యాపించాయనే విషయం ఇంకా తెలియరాలేదు. వేసవి కాలం కావడంతో ఎండవేడికి మంటలు అధికమై తాటి ఈత చెట్లు దగ్ధం అవ్వడంతో తాటి, ఈత చెట్లను నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమకు తీవ్ర నష్టం జరిగిందని స్థానిక గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆర్థికంగా ఉపాధి కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Next Story

Most Viewed