రెండో స్థానం కోసమే ప్రతిపక్షాల పోటీ : బండి సంజయ్

by Disha Web Desk 23 |
రెండో స్థానం కోసమే ప్రతిపక్షాల పోటీ : బండి సంజయ్
X

దిశ,కొడిమ్యాల : కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తన విజయాన్ని ఖాయం చేశారని రెండో స్థానం కోసమే ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. మండల కేంద్రంలోని పద్మశాలి సంఘంలో మండలానికి చెందిన వివిధ గ్రామాల యువకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశం బాగుందాలంటే నరేంద్ర మోడీ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీ లను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికలు రావడంతో ఇప్పుడు ఓటేయండి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం పెద్ద బోగస్ అని ఆయన మండిపడ్డారు.

మేము శ్రీరాముని భక్తులము,వాళ్లకు దమ్ముంటే బాబర్ పేరుతో జనంలోకి వెళ్ళాలనీ సవాల్ విసిరారు.రెండు పార్టీలకు శ్రీరాముడి పేరు వింటేనే వణుకు పుడుతుందనీ అన్నారు. కాంగ్రెస్,బీఆర్ఎస్ నేతలు ఏనాడైనా ప్రజల పక్షాన పోరాడరా, లాఠీ దెబ్బలు తిన్నారా,ప్రజా సమస్యలపై కొట్లాడి జైలుకు పోయారా అని ప్రశ్నించారు. నేను ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేసిన, నాపైన వందకు పైగా కేసులున్న జనం కోసం పోరాడుతున్న ఉన్న పోరాడుతూనే ఉంటానని తెలిపారు. మరోసారి భారీ మెజారిటీతో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి గా గెలిపించి నరేంద్ర మోడీని మూడోసారి దేశ ప్రధానిగా ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభా,మండల నాయకులు రవీందర్ రెడ్డి, లింగా రెడ్డి,గౌతం రెడ్డి,బండ నర్సింహ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed