పొన్నం,కౌశిక్ మధ్య నలిగిపోతున్న అధికారులు..

by Aamani |
పొన్నం,కౌశిక్ మధ్య నలిగిపోతున్న అధికారులు..
X

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రస్తుతం కరవమంటే కప్పకు కోపం, విడవ మంటె పాముకు కోసం అన్నట్టు వుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నియోజక వర్గం లో కొత్తగా ఇచ్చే సంక్షేమ పథకాలు మొత్తం ఆగిపోయాయి. మూడు నెలలుగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల ద్వారా వచ్చే పింఛన్లు,కల్యాణలక్ష్మి చెక్కులు,సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆగిపోయాయి. ప్రభుత్వ అధికారుల వద్దనే అవి పంపిణీకి నోచుకోక మూలుగుతున్నాయి.ఈ దశలో ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పొన్నం ప్రభాకర్ అధికారులపై ఒత్తిడి చేసి చెక్కులు ఇవ్వకుండా చేస్తున్నాడని,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే పంచాలని ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్డీఓ ,ఎ ఆర్ఓ లతో ఫోన్ లో మాట్లాడే సంభాషణ ను లైవ్ లో వినిపించారు.

మంత్రి మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే గా ఈటెల ఉన్నప్పుడు ఎమ్మెల్సీ గా ఉన్న కౌశిక్ రెడ్డి చెక్కులు పంచడం జరిగిందని,ఇప్పుడు అక్కడ ప్రోటోకాల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కి నాయకుడు లేడు కాబట్టి అధికారులు మీరే స్వయంగా పంచాలని,ఒక్క చెక్కు ఎమ్మెల్యే చేతికి పోవద్దని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం హుజురాబాద్ లో ఎమ్మెల్యే,మంత్రి పొన్నం మధ్య చెక్కుల పంపిణీ యుద్ధం జరుగుతుంది.దీంతో పాటుగా తాజాగా ఫ్లై యాష్ గొడవ మంత్రి పొన్నం,కౌశిక్ మధ్య పెద్ద అగాధాన్ని పెంచింది.ఫ్లై యాష్ గొడవ లో ఎమ్మెల్యే తో పాటుగా ప్రచురించిన మీడియా పై సైతం లీగల్ గా పొన్నం చర్యలకు సిద్ధం అయ్యాడు.దీనికి భయపడేది లేదని,ఇప్పటి కైనా నీవు పైసలు తీసుకోలేదని ప్రమాణం చేయాలని బుధవారం వరకు టైం పెడుతూ కౌశిక్ ఛాలెంజ్ చేయడం నియోజకవర్గం లో పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై కౌంటర్ కు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం అవుతున్నారు.

తలలు పట్టుకుంటున్న అధికారులు..

కౌశిక్,మంత్రి పొన్నం ల మధ్య తమ పరిస్థితి దారుణంగా తయారైందని,ఇక్కడ పనిచేయడం కన్నా ట్రాన్స్ ఫర్ పెట్టుకుని వెళ్లడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చెక్కులు పంపిణీ చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అవసరమైతే కోర్టుకు వెళ్లడం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు.ఇప్పటికే ఇద్దరు ఎంఆర్ఓ లు జైలుకు వెళ్లడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. దీంతో ఎమ్మెల్యే కు సమాచారం ఇస్తే మంత్రి కి కోపం,ఇవ్వకుంటే ఎమ్మెల్యే కు కోపం ....వీరు ఇద్దరి మధ్య తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారయిందని వారు వాపోతున్నారు.Next Story

Most Viewed