అక్రమ నిర్మాణాలను పట్టించుకోని అధికారులు

by Dishanational2 |
అక్రమ నిర్మాణాలను పట్టించుకోని అధికారులు
X

దిశ ,శంకరపట్నం: కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గంలోని, శంకరపట్నం మండలం కరీంపేట్ గ్రామంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. కరీంపేట శివారులో ఎస్సారెస్పీ, ఆర్ అండ్ బీ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసిన అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడంలేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

కరీం పెట్ గ్రామంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు ఎస్సారెస్పీ ఆర్ అండ్ బీ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో గ్రామ శివారులోని మెయిన్ కెనాల్ పక్కనే ఎస్సారెస్పీ చెందిన భూమిలో ఆర్ అండ్ బీ రోడ్డుకు సమీపంలో ఓ వ్యక్తి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నాడని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ నిర్మాణాలను ఆపి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరుచున్నారు.

మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక చొరవ తీసుకొని కరీంపేట్ నుండి తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం వరకు కేశవపట్నం కరీంపేట గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు లక్షల రూపాయల నిధులతో తారు రోడ్డు వేయించారని, అలా ప్రత్యేక చొరవ తీసుకొని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కేశవపట్నం నుండి హుస్నాబాద్‌కు టీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పించారని, టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు, బస్సు డ్రైవర్లు, రోడ్డు ఇరుకుగా ఉందని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే సాకుతో టీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను నిలిపివేసి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed