నరుడు vs వానరుడు.. కరీంనగర్ ఉజ్వల పార్క్‌లో కోతుల బెడద

by Disha Web Desk 23 |
నరుడు vs వానరుడు..  కరీంనగర్ ఉజ్వల పార్క్‌లో కోతుల బెడద
X

దిశ, కరీంనగర్ టౌన్ : కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉజ్వల పార్కులో రోజురోజుకీ కోతుల బెడద పెరిగిపోతుంది. పార్కులో మనుషుల కంటే కోతుల ఎక్కువగా కనిపిస్తున్నాయి. పర్యాటకుల దగ్గర నుండి తినుబండారాలను లాక్కొని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పర్యాటకులు తమ బ్యాగులను పక్కనపెట్టి ఫోటో దిగేలోపే కోతులు బ్యాగులు లాక్కొని నానా హంగామా సృష్టిస్తున్నాయి.

పెరుగుతున్న పర్యాటకుల తాకిడి..

వేసవి కాలం కావడంతో పార్కుకి పర్యటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. పిల్లలకి వేసవి సెలవులు రావడంతో పార్కు వచ్చే ఆడుకుంటున్నారు. అయితే పార్కులో ఉన్న కోతులతో పర్యాటకులు పిల్లలు జంకుతున్నారు. పర్యాటకులు చేతిలో కర్ర సహాయంతో భయం భయంగా పార్కులో తిరుగుతున్నారు. ఫోటోషూట్ కోసం వచ్చిన ఫోటోలు దిగాలనుకున్న ఎవరో ఒకరు వారి బ్యాగుల దగ్గర కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

పర్యవేక్షణలో అధికారులు అలసత్వం..

పార్కులో అధికారుల అలసత్వంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతుల బెడదను నిర్మూలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. పర్యాటకుల నిర్వహణ తమకేమీ పట్టనట్టు కనీసం అవసరాలు సైతం ఏర్పాటు చేయకుండా పర్యాటకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

క్యాంటీన్లో అధిక ధరకు విక్రయాలు....

పర్యటకుల అవసరాల్ని అదునుగా మలుచుకుని క్యాంటీన్ నిర్వాహకులు కూల్డ్రింక్స్ తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తూ పర్యాటకుల జేబులకు చిల్లులు వేస్తున్నారు. అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై అధికారుల మౌనం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రంగు కోల్పోయిన వివేకానందుడు....

ఉజ్వల పార్క్ ఎంట్రెన్స్ లో ఏర్పాటు చేసిన వివేకానందుడు విగ్రహం రంగును కోల్పోయింది. యువతకు స్ఫూర్తి వివేకానందుడు. అలాంటి వివేకానందుడు విగ్రహాము పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులు....

ఉజ్వల పార్కు వచ్చే పర్యాటకులు తమ వాహనాలను నిలుపుకునేందుకు పార్కింగ్ స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపుకొని పార్క్ లోకి వెళ్తున్నారు. దీంతో రోడ్డు వెంట వచ్చే వాహనదారులు ట్రాఫిక్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇటీవల పార్కును సందర్శించిన కలెక్టర్....

గత వార రోజుల క్రితం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఉజ్వల పార్కును సందర్శించారు. తహలదం కొరకు వచ్చే పర్యాటకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.


Next Story