రైతులను పరేషాన్ చేస్తున్న మిల్లర్‌లు

by Disha Web Desk 23 |
రైతులను పరేషాన్ చేస్తున్న మిల్లర్‌లు
X

దిశ,శంకరపట్నం : రైతు ధాన్యాన్ని పండించడం ఒక సవాలు అయితే ,దాన్ని అమ్ముకోవడం మరొక సవాలుగా మారుతుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న దిగుబడులు. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే రైస్ మిల్లర్లు చీడపీడల కంటే ప్రమాదకరం గా మారుతున్నారు . అందిన కాడికి దోచుకోవడమే వీరి లక్ష్యమా.. అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

శంకరపట్నం మండలంలోని తాడికల్ సహకార సంఘం పరిధిలో గల ఇప్పలపల్లి గ్రామంలో ధాన్యం కాంటావేసి పంపిన తర్వాత ధాన్యంలో తాలు ఉంది అని చెప్పి దిగుమతికి నిరాకరించి బస్తాకు ఒక కేజీ చొప్పున కోత విధించడం తో రైతులు లబోదిబోమంటున్నారు. ధాన్యాన్ని దిగుమతి చేసుకునే ఓ రైస్ మిల్ యజమాని దిగుమతి సందర్భంగా బస్తాలలో తాలు అధికంగా ఉందని కొర్రి పెట్టడం జరిగింది. 1 కేజీ ధాన్యాన్ని,అదనంగా ఇవ్వాల్సిందేనని మిల్లర్ పట్టుబట్టడంతో రైతులు తప్పని పరిస్థితుల్లో అంగీకరించినట్లు తెలిపారు.


Next Story

Most Viewed