జగిత్యాల ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్: 12 ద్విచక్ర వాహనాలు పట్టివేత

by Disha Web Desk 1 |
జగిత్యాల ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్: 12 ద్విచక్ర వాహనాలు పట్టివేత
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని జగిత్యాల ట్రాఫిక్ ఎస్సై ఎల్.రాం తెలిపారు. జిల్లా ఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి పట్టణంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. పట్టణంలోని పాత బస్ స్టాండ్, టవర్ సర్కిల్, మంచి నీళ్ల బావి చౌరస్తా వద్ద చేపట్టిన వాహనాల తనిఖీలలో 10 వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా పట్టుబడ్డాయని తెలిపారు. మరో రెండు వాహనాలు సైలెన్సర్ లేకుండా దొరికాయని తెలిపారు. పట్టుబడిన వాహనాలను ఎంవీఐకి అప్పగిస్తామని అన్నారు. సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేసే విధంగా వాహనాలకు అమర్చుతున్న సైలెన్సర్లను తొలగించి కంపెనీ నుంచి వచ్చే సైలెన్సర్లను మాత్రమే వాడాలని సూచించారు.



Next Story