కానిస్టేబుళ్లపై చర్యలు సరే.. మరి అధికారులపై లేవా..?

by Aamani |
కానిస్టేబుళ్లపై చర్యలు సరే.. మరి అధికారులపై లేవా..?
X

దిశ,హుజురాబాద్ : హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లు వసూళ్లకు పాల్పడుతూ స్టేషన్ హౌస్ ఆఫీసర్ లకు అనుకూలంగా ఉన్నారని సీపీ ఫిర్యాదులు అందుకున్నారు. వారిని సీపీ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఏసిపి పరిధిలో పనిచేస్తున్న హుజురాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఉన్న బోల్లం రమేష్ వద్ద గన్ మెన్ గా ఉన్న అవినాష్ పై అనేక పిర్యాదులు సి పి వద్దకు వెళ్లినట్లు సమాచారం.దీంతో పాటుగా జమ్మికుంట,జమ్మికుంట రూరల్ సీఐ ల వద్ద పనిచేస్తున్న ఇద్దరు గన్ మెన్ లను సైతం అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..వీరు వసూళ్ల లో లక్షల రూపాయలు పోగు చేశారని,స్టేషన్ లో వీరు చెప్పిందే వేదం.. కింది స్థాయిలో పని చేస్తున్న ఎస్ఐ, ఏఎస్ఐ,హెడ్ కానిస్టేబుళ్లకు సైతం విలువలు లేకుండా పోయాయని పిర్యాదులు అందుకున్న సీపీ అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. విచారణలో వీరు అవినీతికి పాల్పడుతూ పోలీసుల కు ఉండే గౌరవ మర్యాదల విషయంలో పాటించాల్సిన నిబంధనలు పాటించకుండా వీరు స్టేషన్ లో సామంత రాజ్యం నడిపారనే ఆరోపణలు వచ్చాయి.

వసూలు చేసిన కానిస్టేబుళ్ల పై చర్యలు సరే...మరి వసూలు చేయించిన అధికారులపై లేవా...అని ప్రజలు,పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హుజురాబాద్ సీఐ కింద పనిచేసిన అవినాష్ వసూళ్ల లో దిట్ట..కానీ వసూలు చేసి అతనొక్కడే తీసుకున్నాడా....అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. కానిస్టేబుల్ అంటే వంద నుంచి మొదలు వెయ్యి వరకు ఉంటుంది. కానీ అర లక్ష,లక్ష ఉండదు కదా... మరి వేళల్లో వసూలు చేసిన డబ్బులు ఎవరికి ఇచ్చాడు అనే విషయం పై విచారణ చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన పిర్యాదు దారుల పట్ల అవినాష్ పై అధికారి వ్యవహరించిన తీరు పట్ల ఫిర్యాదు కి గురి అయిన వారు భయ బ్రాంతులకు గురి అయిన సందర్భం లో ఎంట్రీ ఇచ్చిన గన్ మెన్ సమస్య తీర్చడం తో పాటుగా అయ్యగారి ఆగ్రహం పోవాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చాలని డిమాండ్ చేసే వాడని,దీంతో వారు డబ్బులు సమకూర్చే వారని తెలుస్తోంది. ఈ విషయం పై సీపీకి పకడ్బందీ సమాచారం అందడంతో మిగతా స్టేషన్ లలో పని చేసే ఎస్ హెచ్ ఓ ల వద్ద గన్ మెన్ లుగా పనిచేస్తున్న వారిపై విచారణ చేస్తే వసూళ్ల దందా తెలియడంతో వీరు ముగ్గురిని అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా వసూల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవడం కన్నా వసూలు చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చట్టం లో నేరం చేసిన వాని కన్న నేరం చేయించిన వారు పెద్ద నేరస్థుల న్న ప్రాథమిక సూత్రాన్ని మరిచి పోవద్దని కోరుతున్నారు.Next Story

Most Viewed