నకిలీ విత్తనాలు అమ్మితే.. పీడీ యాక్ట్ నమోదు చేస్తాం : ఎస్పీ ఎగ్గడి భాస్కర్.

by Disha Web Desk 1 |
నకిలీ విత్తనాలు అమ్మితే.. పీడీ యాక్ట్ నమోదు చేస్తాం : ఎస్పీ ఎగ్గడి భాస్కర్.
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : నకిలీ విత్తనాలు అమ్మినా.. ఉత్పత్తి చేసినా.. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు. జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలు విక్రయించే వారి సమాచారం పోలీసులకు అందజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. నకిలీ విత్తనాలు ఉత్పత్తి చేసిన విక్రయించిన అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు.

వర్షాకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రైతులు కూడా వ్యవసాయ శాఖ అధికారులు నిర్దేశించిన దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేస్తే మంచిదన్నారు. నకిలీ విత్తనాల విషయంలో కీలక సమాచారం అందించిన వారికి పారితోషకం కూడా ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు. నకిలీ విత్తనాల సమాచారం స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాజు 8712656807, సీసీఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు 8712656810, సీసీఎస్ ఎస్.ఐ సధాకర్ 8712573691లకు అందజేయాలని సూచించారు.

Also Read..

వెలవెలబోతున్న తెల్ల బంగారం



Next Story

Most Viewed