పసుపు బోర్డు తెప్పించిన నేనే.. షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తా : ధర్మపురి అరవింద్

by Disha Web Desk 23 |
పసుపు బోర్డు  తెప్పించిన నేనే.. షుగర్  ఫ్యాక్టరీలను తెరిపిస్తా : ధర్మపురి అరవింద్
X

దిశ ,మెట్ పల్లి : మెట్ పల్లి పట్టణంలో వెంకట్ రెడ్డి గార్డెన్ లో నిర్వహించిన పసుపు రైతుల కృతజ్ఞత సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులపై ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. నేను రాసిచ్చిన బాండ్ పేపర్ ప్రకారం పదవి కాలం ముగియక ముందే పసుపు బోర్డు తీసుకొచ్చానని 100 రోజులు తెరిపిస్తానన్న ముత్యంపేట సుగర్ ఫ్యాక్టరీ ఏమైందని ఎమ్మెల్సీ కవితపై అరవింద్ మండిపడ్డారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడిన వీడియోను వినిపించారు.ప్రపంచ దేశాల్లో పసుపు పంటలో భారత్ దేశమే మొదటి వరుసలో ఉందని దీనివల్ల రాబోయే తరంలో 8000 కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతుందని దేశ అభివృద్ధిలో భాగంగా ప్రధానమంత్రి పలు అభివృద్ధి పథకాలు తీసుకురాగా కేసీఆర్ వాటిని నిరాకరించాలని తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే మొదటి ఇన్స్టాల్మెంట్ కింద రేవంత్ రెడ్డికి 50 కోట్లు అప్పుగా ఓ పెద్దమనిషి పంపించడని ఇలా అప్పుల పాలు చేసి మళ్లీ వాటిని మనపై రుద్దుతాడని అన్నారు. అసంభవం కానీ పసుపు బోర్డును నేను తెప్పించానని మీ అయ్యకు సిగ్గు ఉంటే ముందు మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డారు.

స్థానిక ఎమ్మెల్యే దోచుకున్నది చాలదన్నట్లు కుటుంబాన్ని సైతం దోచుకునేందుకు రంగంలోకి దింపడానికి నియోజకవర్గంలోని పథకాలను వారి అనుచరులకే ఇచ్చారని ఇక్కడ రైతులు, యువత ను నిరుత్సాహపరిచిన ఎమ్మెల్యేకు ఈసారి ఎన్నికల్లో నియోజకవర్గం ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 గురు అవినీతికి పాల్పడని బలమైన అభ్యర్థులు బరిలో ఉంటారని తప్పక గెలిపించాలని అన్నారు.బీజేపీ గెలుస్తుందనే అనే భయంతో ఒక్కొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గానికి 50 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని నీళ్లు నిధులు నియామకాలు మరిచిపోయి కోరుట్ల నియోజకవర్గ ప్రజలను దోచుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే పై మండిపడ్డారు.ఈ కార్యక్రమం లో మాజీ రాష్ట్ర బీసీ చైర్మన్ తల్లోజు ఆచారి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, దన్ పాల్ సూర్య నారాయణ, జిల్లా అధ్యక్షులు మోరం పెల్లి సత్యనారాయణ, కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడుపెల్లి గోపాల్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, దినేష్ ప్రకాష్ రెడ్డి, భోగ శ్రావణి, తులా ఉమా, సురబీ నవీన్,శీలం వేణు,సాంబారి ప్రభాకర్, డాక్టర్ రఘు, గుంటుక సదాశివ్,బిజెవైఎం పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ , దొనికెల నవీన్, శ్రీకాంత్, అనిల్, నరేష్,బిజెపి కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed