కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత హనుమాన్ చాలీసా పారాయణం

by Disha Web Desk 1 |
కొండగట్టులో ఎమ్మెల్సీ కవిత హనుమాన్ చాలీసా పారాయణం
X

జగిత్యాల బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు.

దిశ, జగిత్యాల ప్రతినిధి /మల్యాల : బుధవారం ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మల్యాల మండలం శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణంలో బోయిన్ పల్లి వినోద్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండగట్టుకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ౌ

స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కవిత అనంతరం భక్తులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి ఏటా 41 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణం జరగాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఆలయ ఈవో వెంకటేష్చ, ఇతర నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

బీరప్ప ఆలయంలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు.

కొండగట్టు నుండి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత నేరుగా జగిత్యాలకు చేరుకొని పట్టణంలో నిర్వహిస్తున్న బీరప్ప ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితకు కురుమ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో రాష్ట్రంలోని దేవాలయాలు, పండగలు ప్రత్యేక గుర్తింపుగా నిలిచాయన్నారు. రానున్న రోజుల్లో బీరప్ప ఆలయ అభివృద్ధికి తన వంతుగా సహకరిస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Also Read...

సచివాలయంలో సోమేశ్ చాంబర్ @ 6వ ఫ్లోర్.. ఎవరికీ కేటాయించకుండా ముందే రిజర్వ్



Next Story

Most Viewed