ప్రభుత్వం వెంటనే పంట నష్ట పరిహారం అందించాలి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి

by Disha Web Desk 1 |
ప్రభుత్వం వెంటనే పంట నష్ట పరిహారం అందించాలి : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి
X

దిశ, రాయికల్: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు వెంటనే ప్రభుత్వం పరిహారం అందజేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి డిమాండ్ చేశారు. బుధవారం రాయికల్ మండలంలోని కిష్టంపెట్, కుమ్మరి పల్లి, కొత్తపేట్ గ్రామాల్లో వర్షం వల్ల దెబ్బతిన్న నువ్వులు, మక్క చేలను, మామిడి తోటలు, వరి పంటలను ఆమె పరిశీలించారు. అనంతరం పంట నష్టపోయిన రైతులతో ఆమె మాట్లాడారు. ఈ సందర్బంగా భోగ శ్రావణి మాట్లాడుతూ.. రైతుల మీద ప్రకృతి కన్నెర్ర చేసిందన్నారు.

మార్చిలో వడగళ్ల వానలు పడి పంట నష్టపోయిన రోజు రైతాంగాన్ని ఆదుకోమని డిమాండ్ చేస్తే.. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో తిరిగి ఎకరానికి రూ.పది వేలు సాయం అందిస్తామని చెప్పిన మాటలు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. జగిత్యాలలో ఇద్దరు పెద్ద నాయకులు కేవలం మైనారిటీల కోసం పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెడుతున్నారని అన్నారు. కేవలం ఎంపీ అరవింద్ మాత్రమే రైతులను ఆదుకోవాలని కలెక్టర్ గారికి లేఖ రాసి రైతుల పక్షాన నిలబడ్డారని గుర్తు చేశారు. ఇప్పటికైనా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి తక్షణే నివేదిక ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ బీర్పూర్ మండల ఇన్ చార్జి పడాల తిరుపతి, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ఉడుత రాంసురేష్, మాజీ ఎంపీటీసీ ఉడుత రవీందర్, ఆడెపు సురేష్, ఆవుల రాజశేఖర్, వేములవాడ మహేష్, గాజెంగి విష్ణువర్ధన్, పూదరి శ్రీనివాస్, పొట్టవత్తిని గంగాధర్, మంగళారపు వేణు, బొంతల ఆదిరెడ్డి, రమేష్, జనార్ధన్, రమేష్, బీజేపీ మాజీ గ్రామ అధ్యక్షులు పాలడుగు రవీందర్, కొడిమ్యాల శేఖర్, కోడిమ్యల రాజశేఖర్, అనిల్, రాజేందర్, రమేష్, సంతు, రవి, నాగరాజు, నరేష్, భీమయ్య, గుగ్గిళ్ల రవీందర్, రాధాకృష్ణ, శేఖర్, గంగాధర్, కిషన్, నాగరాజ్, శ్రీను, వెంకటి, రామస్వామి, కమ్మరి శీను, గంగారెడ్డి, నరేష్, దరి, గంగన్న, తిరుపతి, రాజేశం, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు

Next Story

Most Viewed