అసైన్డ్ భూమిలో యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం

by Dishanational2 |
అసైన్డ్ భూమిలో యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం
X

దిశ, జమ్మికుంట : జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం జంగం రాజయ్య అనే వ్యక్తికి లావని పట్టా (అసైన్డ్) 1ఎకరం 20గుంటల భూమిని వ్యవసాయం కోసం ఇచ్చింది. కానీ జంగం రాజయ్య కొడుకు జంగం మహేష్ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. దీంతో కొన్ని సంవత్సరాలు సాగు చేసిన ఆ భూమిని ప్లాట్లు గా మార్చి అమ్మకాలు చేస్తున్నాడు. చట్టం ప్రకారం లావని పట్టా (అసైన్డ్) భూమిని అమ్మడం, కొనడం నేరమని ఇద్దరికి తెలిసిన నిబంధనలు తుంగలో తొక్కి ప్లాట్లు గా చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు పెద్ద ఎత్తున చర్చింగులుంటున్నారు. సామాన్యు నిరుపేద ప్రభుత్వ భూమిలో గుంట స్థలంలో రేకుల షెడ్ వేసుకుంటే నిబంధనల పేరిట నానా హంగామా చేసి రేకుల షెడ్ ను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఎకరం ఇరవైకుంఠల ప్రభుత్వ భూమిని లావాని పట్టాగా ఇస్తే లక్షలాది రూపాయలకు మరో వ్యక్తికి అమ్ముకుని అదే స్థలంలో యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తు లక్షలాది రూపాయలు లాభం పొందుతున్నారు.ఇంత తతంగం జరుగుతున్న రెవెన్యూ అధికారులు అటువైపు చూడకపోవడం వెనక ఆంతర్యం ఏంటని ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed