బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్..

by Disha Web Desk 23 |
బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్..
X

దిశ,మానకొండూరు : కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఆరెపల్లి మోహన్ ఇటీవల 28 మార్చి గురువారం రోజు బీజేపీ పార్టీకి,సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి శుక్రవారం తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తనకు టికెట్ ఇవ్వాలని, పలుమార్లు రాష్ట్ర,కేంద్ర నాయకులకు విన్నవించుకున్న పట్టించుకోక పోవడం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఓటర్లు ఎక్కువగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, తనకు టికెట్ కేటాయించాలని పలు మార్లు కోరినప్పటికి బీజేపీ పార్టీ నేతలు స్పందించకపోవడంతో పార్టీని వీడి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తెలిపారు. బీజేపీ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో తనకు సహకరించిన బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, గంగాడి కృష్ణారెడ్డి, జగన్ రెడ్డి, మండల నాయకులకు ఆరేపల్లి మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ పై త్వరలోనే వెల్లడిస్తానని మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తెలిపారు.


Next Story

Most Viewed