హుజూరాబాద్ ను వీడనున్న ఈటెల ?

by Disha Web Desk 15 |
హుజూరాబాద్ ను వీడనున్న ఈటెల ?
X

దిశ, హుజూరాబాద్ : రెండు దశాబ్దాలకు పైగా హుజూరాబాద్ తో ఈటెల పెనవేసుకున్న బంధం విడిపోనున్నదనే ప్రచారం జరుగుతుంది. హుజూరాబాద్ లో వరుస విజయాలతో ఈటెల తనకు ఎదురులేదని భావించిన తరుణంలో అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పటి నుండి ఈటెల హుజూరాబాద్ వైపు కన్నెత్తి చూడక పోవడం తో ఆయన వెన్నంటి ఉండి ఇంతకాలం కాపలాకాచిన ఆయన అనుచరులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఈటెల అనుచరులు బీజేపీతో అనుబంధం ఉన్న వ్యక్తులు కారు. ఆయన యే పార్టీలో ఉంటే ఆ పార్టీ లోకి వచ్చి పనిచేస్తారు.

వారు కేవలం ఈటెల కు మాత్రమే పనిచేస్తారు. దీనికి ఉదాహరణ ఈటెల అనుచరులు ప్రస్తుతం ఆయన సొంత మండలం కమలాపూర్, జమ్మికుంట లలో జరిగిన బండి సంజయ్ యాత్ర లో ఎక్కువగా కనబడక పోవడం.. గతం లో సైతం బీజేపీ కార్యక్రమాల్లో కనబడక పోవడమేనని చెప్పవచ్చు. దీని వెనుక ఈటెల మాట ఉందా....కార్యకర్తలే నిర్ణయం తీసుకున్నారా అన్నది వంద మిలియన్ ల ప్రశ్న. కాగా తాజాగా ఈటెల కు మల్కాజ్ గిరి నుండి ఎంపీ టికెట్ ఇస్తున్నారనే వార్తలు వెలువడటం తో బీజేపీ శ్రేణులు సంతోషంగానే ఉన్నా ఆయన అనుచరులు మాత్రం కొంత నారాజ్ గానే ఉన్నట్లు కనబడుతుంది. వీరంతా ప్రస్తుతం ఈటెల ను వీడి కొత్త పార్టీ

వెతుక్కునే పనిలో ఉన్నట్లు కనబడుతుంది. ఈటెల తన అనుచరులను ఇంత వరకు బండి కి పూర్తిగా అప్పగించిన దాఖలాలు లేవని తెలుస్తోంది. కార్యకర్తల మాటలనుబట్టి.. ఈ పరిణామాలను పరిశీలిస్తే ఈటెల హుజూరాబాద్ ను వీడితే ఆయన అనుచరులను తమ వైపు తిప్పుకోవాలనే ఆశతో ఎమ్మెల్యే కౌశిక్, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ లు వ్యూహం పన్నుతున్నారు. కాగా మరో కోణం లో బీజేపీ ఎంపీ గా పోటీ చేసేందుకు ఈటెల మల్కాజ్ గిరి కి వెళ్లినా హుజూరాబాద్ బాధ్యతలు ఆయన సతీమణి కి అప్పగిస్తారనే ప్రచారం ఉన్నా హుజూరాబాద్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వీరు హుజూరాబాద్ ను అంటీ ముట్టనట్లు ఉండటంతో వీరు కచ్చితంగా హుజూరాబాద్ ను వీడుతారనే ఊహాగానాలకు బలం చేకూరుతుంది. ఏది ఏమైనా ఈ ప్రశ్నకు సమాధానం ఈటెల మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంది.


Next Story

Most Viewed