జిల్లా కోఆప్షన్‌కు ప్రోటోకాల్ అవమానం..

by Aamani |
జిల్లా కోఆప్షన్‌కు ప్రోటోకాల్ అవమానం..
X

దిశ, రామడుగు : జిల్లా కో ఆప్షన్ సభ్యుడు ఎండి శుక్రుద్దీన్ కు శుక్రవారం ప్రోటోకాల్ అవమానం జరగడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామడుగు మండల కేంద్రంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ జవ్వాజి హరీష్ ఆధ్వర్యంలో జరిగింది. కాగా సభ ప్రారంభం లో ప్రోటోకాల్ ప్రకారం ఆయా స్థాయి ప్రజాప్రతితులు అధికారులను సభ పైకి ఆహ్వానించగా మండల స్థాయి ప్రజాప్రతినిధులు హాజరు కాకపోగా జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి సుకృద్దీన్ హాజరు కావడంతో ప్రోటోకాల్ ప్రకారం తనను సభా పైకి ఆహ్వానించారు. ఈ తరుణంలో సభ గంట పాటు కొనసాగుతుండగా మధ్యలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సర్వసభ్య సమావేశానికి హాజరవుతున్న విషయం తెలుసుకున్న అధికారులు ప్రజాప్రతినిధులు తనను ఆహ్వానించేందుకు సభను నిలుపుదల చేసి స్వాగతం పలికారు. కాగా అప్పటివరకు ఎంపీపీ, ఎంపీడీవో జిల్లా కో ఆప్షన్ సభ్యులు మాత్రమే స్టేజిపై ఉండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పైకి రావడంతో మరో కూర్చుని వేయవలసింది పోయి కేవలం మూడే కుర్చీలతో సరిపెట్టారు. దీంతో జిల్లా కో ఆప్షన్ సభ్యుడు సర్వసభ్య సమావేశం మూగిసే వరకు ఆరు బయట నిలబడిపోయారు. ఇదంతా కావాలని చేస్తున్నట్లు సభ ప్రారంభంలో మూడు కుర్చీలు ఉన్నప్పుడు ఎమ్మెల్యే వస్తున్నప్పుడు నాలుగో కూర్చి వేయాల్సింది పోయి మూడు కుర్చీలనే ఉంచడం ఇది ఎంతవరకు సమంజసం అని దీనిపై జిల్లా స్థాయి సంబంధిత అధికారులకు ప్రోటోకాల్ విషయంలో ఫిర్యాదు చేస్తున్నట్లు జిల్లా కో ఆప్షన్ సభ్యులు సుకృద్దీన్ తెలిపారు.

Advertisement

Next Story