- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తొమ్మిదేళ్లలోనే దశాబ్ది ఉత్సవాలు హాస్యాస్పదం.. తాటిపర్తి విజయలక్ష్మి
దిశ, జగిత్యాల ప్రతినిధి : తొమ్మిది ఏళ్లలోనే దశాబ్ది ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గొప్పలు చెప్పుకోవడానికే ప్రభుత్వం ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయలక్ష్మి మాట్లాడారు. పెన్షన్ల పేరు చెప్పి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని అసత్యాలు ప్రచారం చేయడం కేసీఆర్ ప్రభుత్వానికే చెల్లుతుందని చురకలంటించారు. రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులను తెలంగాణ ప్రభుత్వం కాల రాస్తోందని బీసీ మహిళకు కేటాయించిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవిలో పురుషుడిని కూర్చోబెట్టడమే అందుకు ఉదాహరణ అని అన్నారు.
మహిళలకు ఇవ్వాల్సిన పావలా వడ్డీ రుణాలు ఎందుకు ఇవ్వడంలేదని ఈ తొమ్మిదేళ్ల కాలంలో మహిళల సంరక్షణ కోసం ఒక్క సమావేశమైన ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాల ప్రకటనలకే ప్రభుత్వం రు.150 కోట్లు ఖర్చు చేసిందని మరి రైతులు ధాన్యం అమ్మి నెల దాటినా ఖాతాల్లో డబ్బులు ఎందుకు జమ చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసామని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి చేకూరిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ములస్తపు లలిత, సహారా అజార్, అల్లాల సరిత, చిట్లలత, బింగి సుమరవి, సంజన, కౌన్సిలర్లు, కల్లేపల్లి దుర్గయ్య, నక్క జీవన్, కాంగ్రెస్ నాయకులు గాజుల రాజేందర్, బింగి రవి, ఆశింసావన్, ముద్దం రాజీరెడ్డి, పాల్గొన్నారు.