తెలంగాణాలో ప్రతీకార రాజకీయాలకు చోటులేదు.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్

by Disha Web Desk 20 |
తెలంగాణాలో ప్రతీకార రాజకీయాలకు చోటులేదు.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్
X

దిశ, హుజూరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజల సొమ్ముకు సీఎం కాపలాదారుడేనని సంచలన వాఖ్యలు చేశారు. కేసి క్యాంపులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన గురువారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడారు. శాంతి భద్రతల పరి రక్షణ కోసం హుజూరాబాద్ నియోజకవర్గం పై జిల్లా పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీఆర్ఎస్ శ్రేణులను నియంత్రించకపోతే జరిగే పతిణామాలకు సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలొస్తేనే కేసీఆర్ కు బీసీలు గుర్తుకొస్తారా అని ప్రశ్నించారు. పేద కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులందరిలో దళితబంధు అందజేయాలన్నారు. మొదటి విడత దళితబంధు లో ఆర్థిక సహాయం పొందిన వారందరికీ రెండవ విడత చెల్లించాలని డిమాండ్ చేశారు. 70 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించాలన్నారు.

ప్రజా వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తున్న బిఆర్ఎస్ కు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సర్వే సంస్థలకు అందని విధంగా ఎన్నికల ఫలితాలుంటాయని జోస్యం చెప్పారు. నిజాలు నిర్భయంగా ప్రసారం చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా పై దాడులు, బెదిరింపులు సరికాదన్నారు. బిఆర్ఎస్ నాయకులు బంధించిన కెమెరామెన్ అజయ్ ను వెంటనే వదిలి పెట్టాలన్నారు. హుజూరాబాద్ లో నిజమైన ఉద్యమ కారులు నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని కూల్చి వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ప్రగతి భవన్ ప్రజల సొమ్ముతో నిర్మించినవేనన్నారు. సీఎం ప్రజల సొమ్ముకు కాపలాదారుడే అన్నారు. హైకమాండ్ నిర్ణయం మేరకే పార్టీకి సేవలందిస్తున్నానని ఈటల స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, గౌతంరెడ్డి, ఎర్రబెల్లి సంపత్ రావు, నేరెళ్ల మహేందర్ గౌడ్, గంగిశెట్టి రాజు, గడిపే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed