రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధరలు..

by Sumithra |
రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధరలు..
X

దిశ, జమ్మికుంట : జమ్మికుంట పత్తి మార్కెట్లో ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. గత వారం రోజులుగా పత్తి ధరలను పరిశీలించినట్లయితే వారం రోజుల్లో క్వింటాలు పత్తికి రూ.300 పెరుగుతూ వచ్చింది. గడిచిన వారంలో పత్తి క్వింటాలుకు రూ.7300 పలకగా, ఈ రోజు క్వింటాలకు రూ.7,600 లు పలకడంతో పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా బుధవారం పత్తి మార్కెట్ కు విడిపత్తి 293 క్వింటాళ్లు అమ్మకానికి రావడంతో గరిష్ట ధర రూ.7,600 లు, కనిష్ట ధర రూ.7,400 లు, మోడల్ ధర రూ.7,500 లతో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు.

Next Story

Most Viewed