మూల మలుపులు... ప్రమాదాలకు పిలుపులు

by Aamani |
మూల మలుపులు... ప్రమాదాలకు పిలుపులు
X

దిశ,కథలాపూర్: ఆదమరిస్తే ప్రమాదమే… జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కలికోట-రుద్రంగి గ్రామా శివారులో ప్రమాదకర మూల మలుపులతో రోడ్లపై తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే రోడ్డు వెంట రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న దేవాలయానికి, అలాగే హైదరాబాద్ కు సైతం ప్రయాణికులు కలికోట మీదుగా ప్రయాణిస్తుంటారు. కలికోట-రుద్రంగి శివారులో ఉన్న మూల మలుపు వద్ద కనీసం ప్రమాద సూచిక బోర్డులు లేక తరచు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రోడ్డుపై నిత్యం వాహనాలు తిరుగుతుంటాయి. సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దృష్టి సారించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలనీ ప్రయాణికులు కోరుతున్నారు.

ఏ వాహనం వస్తుందో తెలియని అయోమయ స్థితి : రాంమోళ్ల రమేష్ ఆర్ ఎంపీ డాక్టర్

తెల్లవారులు లేచింది మొదలు ప్రతి చిన్న అవసరానికి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి వెళ్తాము. కాగా మా గ్రామమైన కలికోట నుండి రుద్రంగి కి వెళ్లే మార్గంలో 4 చోట్ల విపరీతమైన మలుపులు ఉండడంతో ఎటునుండి ఏ వాహనం వస్తుందో తెలియని అయోమయ స్థితి.కాబట్టి అధికారులు మలుపులు ఉన్న చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.

ఆనవాళ్లు సరిగా అధికారులు కల్పించినట్లయితే బాగుంటుంది : తీగల శ్యామ్ సుందర్ రావు, రుద్రంగి.

రుద్రంగి మండల కేంద్రం నుండి కోరుట్లకు వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటాం. అందులో భాగంగా కలికోట గ్రామం మీదుగా ప్రయాణం చేస్తుంటాం.అయితే అక్కడ మలుపులు ఉన్నట్లు ఆనవాళ్లు సరిగా అధికారులు కల్పించినట్లయితే బాగుంటుంది. దీని ద్వారా తరచుగా జరిగే ప్రమాదాలను నివారించడానికి అవకాశం ఉంటుంది. అందుచేత అధికారులు సూచికలు ఏర్పాటు చేయాలి.

Advertisement

Next Story