- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
సమ్మె విచ్చిన్నానికి కుట్ర.. హైదరాబాద్‌లోనే చీకటి ఒప్పందం..?

దిశ, గోదావరి ఖని: హైదరాబాద్‌లో కాంట్రాక్టు కార్మికుల సమ్మె విచ్చిన్నానికి నలుగురు నాయకులు కుట్ర చేస్తున్నారని హెచ్ఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ రియాజ్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం కొందరి నాయకులతో సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి యాజమాన్యం లాభాల వాటాను ప్రకటించడం లేదని ఫైర్ అయ్యారు.
సింగరేణిలో మైనింగ్ స్టాఫ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అంతే కాకుండా ట్రేడ్ యూనియన్ నాయకులు కేవలం పైరవీలకు మాత్రమే పరిమితం అవుతున్నారని.. కార్మికుల సమస్యలు పరిష్కరించాడం లేదని ఆరోపించారు. అలాగే కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సింగరేణికి సంబంధించి జెన్కో కంపెనీ వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉన్న వాటిని ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు.