బీజేపీ పాలనకు స్వస్తి పలకాలి: Chada Venkat Reddy

by Dishanational1 |
బీజేపీ పాలనకు స్వస్తి పలకాలి: Chada Venkat Reddy
X

దిశ, పెద్దపల్లి: బీజేపీ పాలన సామాన్య ప్రజలకు గుదిబండలా మారిందని.. ఎనిమిది ఏళ్లుగా అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ సామాన్యులకు గుదిబండగా తయారైందని, దేశంలో బీజేపీ పాలన స్వస్తి పలకాలని (తరిమి వేయాలని) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో జరిగిన సీపీఐ మూడో జిల్లా మహాసభలకు చాడ వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నిత్యావసర వస్తువులపై ధరలను పెంచి పేద ప్రజలపై ఆర్థిక భారం మోపారని ఆయన విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపారని, దేశ ఖనిజ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయ సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలను బడా పారిశ్రామికవేత్తలకు అమ్ముకుంటున్నారని విమర్శించారు.

దేశంలో మరియు రాష్ట్రంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రజలను విడదీస్తూ దేశ సమాఖ్యతను దెబ్బతీయాలని చూస్తున్నారని, బీజేపీ పాలనను ప్రజలంతా ఏకమై పాలనను అంతమొందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు పోరాటాలు నిర్వహించి ప్రజల మనసులను గెలుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

మహాసభలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ సంతాపం తీర్మానాన్ని ప్రవేశపెట్టి గత మహాసభల నుండి నేటి మరణించిన ప్రముఖులకు పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం గత మహాసభ నుండి నేటి మహాసభ వరకు జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమాలపై నివేదికను ప్రవేశపెట్టి ప్రతినిధులకు వినిపించారు.

మహాసభకు అధ్యక్ష వర్గంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శ బాలసాని లెనిన్, ఏఐవైఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్కాపురి సూర్య వ్యవహరించగా, మహాసభలో ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు స్వామి, కన్నం లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ఇనుముల రాజమౌళి, మరియు కళాకారులు విప్లవ గీతాలు ఆలపించారు. ఈ మహాసభలో రాష్ట్ర సమితి సభ్యులు గోశిక మోహన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కనకరాజ్, తాళ్లపల్లి మల్లయ్య, మద్దెల దినేష్, కౌన్సిల్ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story