మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల పై కేసులు.. సీఐ వేణుగోపాల్

by Sumithra |
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల పై కేసులు.. సీఐ వేణుగోపాల్
X

దిశ, జగిత్యాల టౌన్ : మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల పై కేసులు పెడతామని జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్సై రామచంద్రం గౌడ్ ఆధ్వర్యంలో సీఐ కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేని 25 బైక్ లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ప్రతి వాహనానికి ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ బిగించుకోవాలని సూచించారు.

నెంబర్ ప్లేట్ లేకపోయినా, నెంబర్ ట్యాంపరింగ్ చేసిన అలాంటి వాహనాలను ఆర్టీవో ఆఫీస్ కి సరెండర్ చేయడంతో పాటు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడతామని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాల అమలులో కఠినంగా వ్యవహరిస్తామని పట్టణంలో నిత్యం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తామని ఈ సందర్భంగా సీఐ స్పష్టం చేశారు.

Next Story