రేకుర్తిలోని మూడు ఇళ్లలో చోరీలు

by Aamani |
రేకుర్తిలోని మూడు ఇళ్లలో చోరీలు
X

దిశ,కరీంనగర్ రూరల్: కొత్తపల్లి మండలం రేకుర్తిలోని కాలోజీ నగర్ లో గల అక్షయ హోమ్స్ పోచమ్మ వాడలో చోరీలు జరిగిన సంఘటన ఆదివారం జరిగింది.వివరాల్లోకి వెళితే రేకుర్తి లోని కాళోజీ నగర్ లో గల అక్షయ హోమ్స్ పోచమ్మ వాడలో గల తాళం వేసి ఉన్న మూడు ఇళ్లల్లో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి ఈ చోరీలకు పాల్పడ్డారు ఈ సంఘటనల్లో జమున ఇంట్లో రూ. 1.85 లక్షలు, తిరుపతి ఇంట్లోరూ. 1.08 లక్షలు రాజేందర్ ఇంట్లో రూ.95 వేల రూపాయల విలువగల బంగారు, వెండి ఆభరణాలు నగదు దొంగిలించబడ్డాయి సంఘటనా స్థలాన్ని క్లూస్ టీం బృందం పరిశీలించి సాక్ష్యాధారాలను సేకరించారు. కరీంనగర్ రూరల్ సిఐ ప్రదీప్, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి లు సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిన సందర్భంలో చుట్టుపక్కల వారితో పాటుగా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గస్తీ ముమ్మరం చేస్తామని చెప్పారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Next Story

Most Viewed