ఛీ... మీరిట్లా చెప్పుకుంటే సిగ్గు చేటు

by Dishanational1 |
ఛీ... మీరిట్లా చెప్పుకుంటే సిగ్గు చేటు
X

దిశ, మల్యాల: దేశవ్యాప్తంగా ప్రజలకు సేవలందిస్తూ 28 రాష్టాల్లో అమలులో ఉన్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ చొప్పదండి నియోజకవర్గం పాలక్ డాక్టర్ వెంకట్ ప్రశ్నించారు. గురువారం మల్యాల మండల కేంద్రంలో జరిగిన ప్రజాగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వాళ్లకు ఆసరాగా రూ. 5 లక్షల వరకు వైద్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ పథకం తీసుకువస్తే, కేసీఆర్ కి వచ్చిన నష్టం ఏంటో చెప్పాలన్నారు. మాజీ మంత్రి సుద్దాల దేవయ్య మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నప్పటికీ ఏమి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటూ తిరగడం సిగ్గుచేటు అన్నారు. ఈ నిరంకుశ, అవినీతి, కుటుంబ పాలన చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడం కోసం గ్రామగ్రామాన చేపడుతున్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్చార్జి దశరథ్ రెడ్డి, బీజేపీ మల్యాల మండల అధ్యక్షుడు నేరెళ్ల శ్రవణ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి గాజుల మల్లేశం, పట్టణ అధ్యక్షులు జనగం రాములు, గాండ్ల శ్రీనివాస్, శక్తి కేంద్ర ఇన్చార్జులు బొబ్బిలి వెంకటస్వామి యాదవ్, రాచర్ల రమేష్ ఎంపీటీసీ సంఘని రవి, బూత్ కమిటీ అధ్యక్షులు, కరబూజ చక్రం గౌడ్ పోరండ్ల మహేష్, అగంతపు నరేష్, యాగండ్ల సాయి తేజ, నక్క ఆనందం, బీజేవైఎం మండల అధ్యక్షుడు పిల్లి రాజశేఖర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొక్కెర శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొత్తూరు సందీప్, భూసారపు మౌనిక్, కందుల వినోద్, గవాస్కర్, నవీన్, గుగ్గిళ్ళ గంగారం, మారుతి, బాల గంగ స్వామి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed